Site icon HashtagU Telugu

Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు, కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్

Harish Rao Rythubandhu

Harish Rao Rythubandhu

Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ సంగారెడ్డిలో రైతు దీక్ష కార్యక్రమంతో పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులనుద్దేశించి మాట్లాడారు. ’’అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గింది. అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుంటున్నారు. వంద రోజుల తర్వాతే కోడ్ వచ్చింది’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘2 లక్షల రుణమాఫీ, వడ్లకు మక్కలకు 500 బోనస్, 4 వేల ఫించన్, రైతుబంధు 15 వేలు, మహిళలకు 2500, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం, 4 వేల నిరుద్యోగ భృతి, ఆడపిల్లలకు ఉచిత స్కూటీ అందినవాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయండి, అందనివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి’’ అని అన్నారు.

‘‘కేసీఆర్ పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు తున్నారు. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయనను తిడుతున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు సిగ్గు ఉందా..రాహుల్ గాంధీ ఏమో తన మ్యానిఫెస్టోలో ఇతర పార్టీ వాళ్ళను పార్టీలోకి తీసుకోవద్దు అని పెడతారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రలు మాత్రం ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి తీసుకుంటాం అని అంటున్నారు’’ అని హరీశ్ రావు సెటైర్లు వేశారు.

‘‘కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల త్వరత మళ్ళీ అధికారంలోకి రాదు. అటు ఉన్న సూర్యుడు ఇటు పొడిచిన కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. మీరు ఎన్ని చేస్తారో చేయండి కానీ గుర్తు పెట్టుకొండి. మేం వడ్డీతో సహా మీకు తిరిగి ఇస్తాము. మీరు ఎన్నిచేసిన ఇచ్చిన హామీలు అమలు చేసేదాక మిమ్మల్ని వదిలిపెటం మీ వెంట పడుతాం’’ అంటూ హరీశ్ రావు మండిపడ్డారు.

Exit mobile version