Save Damagundam: వికారాబాద్‌లోని దామగుండం ఫారెస్ట్ (Damagundam Forest) రోదిస్తోంది. నిజానికి….ఇది అడవి రోదన కాదు…అడివినే కొట్టేస్తే మాత్రం… భావి తరాల రోదనే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హైడ్రా (Hydra) , మూసీ నదుల (Musi River) ప్రక్షాళణకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం…ఎకో సెన్సిటివ్ జోన్‌లో (Echo Sensitive Zone) రాడార్ స్టేషన్ (Radar Station) పెట్టడానికి ఎలా పర్మిషన్ ఇస్తుంది.
ఇంకా మూసీ (Musi), కాగ్నా (Kagna), ఈసా (Easa), నదుల మూలాలున్న వికారాబాద్ ఫారెస్ట్‌కి చెందిన దామగుండం ఫారెస్ట్‌ని…వెరీ లో ఫ్రీక్వెనీ నేవీ రాడార్ స్టేషన్ (Vey Low Freaquency Radar Station) నిర్మాణం కోసం…కేంద్ర నౌకాదళానికి అప్పగించింది. హైదరాబాద్‌కి ఆక్సిజన్ సిలిండర్ (Oxygen Sylinder) లాంటి ఈ అడవిని నరికేస్తే…12 లక్షల చెట్లు (12 Lakh Tress) పోతాయ్. మూడు వేల ఎకరాల వయస్సున్న ఈ అడవి వయస్సు ఆల్‌మోస్ట్ ధౌజండ్ ఇయర్స్. అలాంటి ఈ అడవిని జస్ట్ మూడేళ్లలో ఒక టౌన్‌షిప్‌గా (Township) మార్చేయబోతున్నారు.
మూసీ నది (Musi River) జన్మస్థానం వికారాబాద్ అడవులు. ఈ అడవులే…సోర్స్ ఆఫ్ ద రివర్… మౌత్ ఆఫ్ ద రివర్ అని కూడా అంటారు. సోర్స్ గనక ఆగిపోతే…అడవుల్లో ఊటలు ఊరడం ఆగిపోయి..నదే ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి అలాంటి సమయంలో…గండిపేట లాంటి (Gandipet Reservoir) జలాశయాలకు నీళ్లు ఎలా వస్తాయి? ఒక్కసారి మీరే ఆలోచించండి? ఈ రాడార్ ఏర్పాటు అయితే…మూసీకి మరణ శాసనమే..! అంతేకాకుండా అక్కడ ఉన్న 20 గ్రామాలకు చెందిన 60 వేల మంది పశువుల కాపరులకు…నిద్ర లేస్తే…ఈ అడవి మాత్రమే దిక్కు.