BC Census Survey : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని అన్నారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Read Also: Israel-Hamas : మరో ఆరుగురు బందీలను విడుదల చేయనున్న హమాస్
కులగణన తప్పు అయితే ఎక్కడ తప్పు ఉందో చూపించండి అని బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి. దానిని మీరు కాపాడుకోకపోతే మీకే నష్టం అని క్లాస్ తీసుకున్నారు. కట్టే పట్టుకొని కాపాడుకోండి. అంతా రేవంత్ రెడ్డే చూసుకుంటాడు. దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకే చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు.
అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగితీరుతుంది. కులగణనను కాపాడుకోకపోతే.. బీసీలే నష్టపోతారు. ఇంత పకడ్బందీగా సర్వే చేసిన రాష్ట్రం ఇకపై కూడా మరొకటి ఉండదు అని సీఎం అన్నారు. నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచనలు ఇవ్వాలని బీసీ సంఘాల నేతలను కోరారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యాచరణపై సూచనలివ్వాలని కోరారు. బీసీ జనాభా ప్రకారం వారికి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.గతంలో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారు. కేసీఆర్ లెక్కల ప్రకారం.. 51 శాతం.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 56.33 శాతానికి పైగా ఉన్నారు. మేము అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించామన్నారు. ఇంటి యజమానులు చెప్పిన లెక్కలే మా దగ్గర ఉన్నాయి. 1.12 కోట్ల కుటుంబంలో సర్వేలో పాల్గొన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Loan Foreclosure Charges: బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్..!