Site icon HashtagU Telugu

Harish Rao: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: పీర్జాదిగూడ మునిసిపల్ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్ దాడిని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ, రాచకకొండ కమిషనర్ వెంటనే పీర్జాదిగూడ మేయర్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలి. ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం గర్హనీయం. ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం’’ అంటూ హరీశ్ రావు అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.