Karnataka BJP: కర్ణాటకలో బీజేపీ ఓడితే తెలంగాణలో అధికారం కష్టమే!

కాంగ్రెస్ ముందంజలో ఉందని అనుకూల తీర్పు రావడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

  • Written By:
  • Updated On - May 13, 2023 / 11:23 AM IST

దేశవ్యాప్తంగా కర్ణాటక (Karnataka) ఎన్నికల రిజల్ట్ ఉత్కంఠత రేపుతోంది. ఇప్పటికే ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉందని అనుకూల తీర్పు రావడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమని ఫలితాలు వెల్లడంచండతో.. పార్టీ అగ్రనాయత్వం అప్పుడే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నది. దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉందని భావిస్తున్న కర్ణాటకలో ఓటమి పాలైతే.. అది తప్పకుండా రాబోయే తెలంగాణ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తోంది. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీకి.. కర్ణాటక ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరో ఆరు నెలల్లో తెలంగాణ (Telangana) అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే.. అది తప్పకుండా తెలంగాణలో ప్రభావం చూపిస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో విభేదాల కారణంగా పార్టీ ప్రజల్లోకి దూసుకొని వెళ్లలేక పోతున్నది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు కూడా దొరకక సతమతమవుతోంది. ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా పెద్దగా ఏమీ లేవు. కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారం చేపడితే.. ఆ ఫలితాలను చూపించి తెలంగాణలో ఇతర పార్టీ నాయకులను గుంజేయాలని వ్యూహం సిద్ధం చేసింది.

అంతే కాకుండా.. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు (BRS) ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రచారం కూడా చేసుకోవాలని భావించింది. కానీ, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి అధిష్టానం ఆందోళన చెందుతుంది. బీజేపీ కర్ణాటకలో అధికారం కోల్పోతే.. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌లా రాజకీయం మారిపోతుందని అంచనా వేస్తుంది. అదే జరిగితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి భారీగా లోక్‌సభ సీట్లు గెలవాలన్న అంచనాలు కూడా తలక్రిందులు అవుతాయని ఆందోళన చెందుతున్నది.