Video Viral : సమ్మర్ వచ్చిందంటే చాలు.. మనం ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటుంటాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఐస్ క్రీమ్‌ను లైక్ చేస్తారు. అయితే ఐస్ క్రీమ్ అమ్మే ఓ వ్యక్తి చేసిన చేష్టలు.. ఐస్ క్రీమ్ అంటేనే అసహ్యం పుట్టేలా చేస్తున్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఐస్ క్రీం బండి నడుపుకునే ఓ వ్యక్తి గలీజు పనికి తెగబడ్డాడు. ఐస్ క్రీం బండి దగ్గర నిలబడి.. తాను రోడ్డుపై ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఐస్ క్రీం బాక్స్ పక్కనే నిలబడి హస్త ప్రయోగం చేసుకున్నాడు.
Also Read : Mohan Babu : మోడీకి సపోర్ట్‌గా మోహన్‌బాబు.. జగన్‌కు వ్యతిరేకంగా మనోజ్ కీలక వ్యాఖ్యలు
పక్కనున్న మరో ఐస్ క్రీమ్ బండి నుంచి ఇదంతా ఓ వ్యక్తి వీడియోలో చిత్రీకరించారు. దీంతో అతగాడు ఐస్ క్రీమ్ బండి దగ్గర చేస్తున్న పిచ్చి చేష్టలు వెలుగుచూశాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. ఈ దారుణ చేష్టకు తెగబడిన వ్యక్తి పేరు కాలురం కుర్బియా అని.. రాజస్థాన్ నుంచి నెక్కొండకు వలస వచ్చి ఐస్ క్రీమ్ బండి పెట్టుకున్నాడని విచారణలో పోలీసులు గుర్తించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి వచ్చి ఐస్ క్రీం శాంపిల్స్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతనిపైన చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
https://twitter.com/TeluguScribe/status/1770076484465729743?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1770076484465729743%7Ctwgr%5E4b4748b578ded087388769c7a58a8005588a32e0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelangana%2Fwarangal%2Fice-cream-seller-caught-with-masterbating-on-warangal-nekkonda-road-in-telangana-video-goes-viral%2Farticleshow%2F108626438.cms
