తెలంగాణ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన దగ్గరి నుండి వరుసగా అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వంలో పనిచేసిన అన్ని శాఖల్లోని అధికారులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా పలువురు ఐఏఎస్‌ల బదిలీలు చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ (Rangareddy district Collector)గా ఉన్న భారతి హోలికేరిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాష్, ఏక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా శ్రీధర్, రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ కెరిపై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ పోర్ట్ ను నియమించారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓజా, ట్రైబల్ ఫెల్ఫెర్ డైరెక్టర్ గా నర్సింహా రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహన్ లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాష్
ఏక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా శ్రీధర్
రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ కెరిపై బదిలీ వేటు
రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ పోర్ట్
ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓజా
ట్రైబల్ ఫెల్ఫెర్ డైరెక్టర్ గా నర్సింహా రెడ్డి
సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహన్
Read Also : Chandrababu Chandi Yagam : చంద్రబాబు ఇంట్లో ముగిసిన మహా చండీయాగం