IAS : భార్య‌పై పోలీస్ కేసు పెట్టిన ఐఏఎస్ అధికారి..కార‌ణం ఇదే..?

తన భార్య, అత్తమామలు తనను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారి,

  • Written By:
  • Updated On - August 8, 2023 / 07:04 AM IST

తన భార్య, అత్తమామలు తనను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ సందీప్ కుమార్ ఝా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య పల్లవి ఝా, అత్తమామలు, బావమరిది చిన్న చిన్న విషయాలకే తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఐఏఎస్ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై గృహహింస, వరకట్న వేధింపుల తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని, తన ఆస్తులను తన భార్య పేరుపై బదలాయించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సందీప్ కుమార్ ఝా 2021లో చత్తీస్‌గఢ్‌కు చెందిన కోర్బాలో పల్లవి ఝాను వివాహం చేసుకున్నారు. ఈ జంట మొదట్లో సంతోషంగా ఉన్నారు. కొన్ని కుటుంబ సమస్యలపై వారి మధ్య విభేదాలు వచ్చాయి. పల్లవి ఝా .. త‌న భ‌ర్త సందీప్‌పై గృహహింస, వరకట్న వేధింపులు, అసహజ శృంగారంలో బలవంతం చేశారని ఆరోపించింది. ఈ విషయమై ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఆరోపిస్తూ పల్లవి స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఐఏఎస్ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే సందీప్ .. త‌న భార్య, అత్తమామలపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.