KTR Hot Comments: నా పదవికి రాజీనామా చేస్తా.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లో ఎంపీ ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌రో ఐదు రోజుల్లో అన్ని పార్టీల ప్ర‌చార స‌భ‌ల‌కు తెర‌ప‌డ‌నుంది.

  • Written By:
  • Updated On - May 6, 2024 / 11:10 AM IST

KTR Hot Comments: తెలంగాణ‌లో ఎంపీ ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌రో ఐదు రోజుల్లో అన్ని పార్టీల ప్ర‌చార స‌భ‌ల‌కు తెర‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీలు ప్ర‌చారంలో దూకుడు పెంచాయి. ఒక‌రి మీద మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, స‌వాళ్లు విసురుకుంటున్నారు. తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్ ఎంపీ స్థానాల‌కు మే 13వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష పార్టీ జోరు పెంచి కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేస్తుంది.

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (KTR Hot Comments) బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థుల త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ ప్ర‌చారంలో బీజేపీ నాయ‌కుల‌పై హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా వారికి స‌వాల్ కూడా విసిరారు. తాను విసిరిన స‌వాలుకు బీజేపీ నాయకులు సిద్ధ‌మైతే త‌న ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. బీజేపీ నేత‌లు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌లు రాష్ట్రానికి చేసిన మేలు ఏం లేద‌న్నారు.

Also Read: MI vs SRH: నేడు ముంబై వ‌ర్సెస్ హైద‌రాబాద్‌.. మ‌రో హైస్కోరింగ్ మ్యాచ్ అవుతుందా..?

బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రూ.30 లక్షల కోట్లు దోచుకొని, అందులో రూ.14 వేల కోట్లు అదానీ, అంబానీలకు పంచిపెట్టారు. నేను చెప్పింది తప్పని కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ పెద్దలు నిరూపించగలిగితే.. రేపు తెల్లవారేసరికి తెలంగాణ తల్లి సాక్షిగా నా రాజీనామాను వారి మొకాన విసిరి కొడతా. పెట్రోల్, డీజిల్ లపై పన్నుల రూపంలో పేదల రక్తం పీల్చి 30 లక్షల కొట్లు దండుకున్నారు’’ అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp : Click to Join

అంతేకాకుండా కాంగ్రెస్ పై కూడా మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అన్ని సాధ్యం కానీ హామీల‌ను ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం అంటూ త‌న‌దైన శైలిలో కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు చేశారు. మ‌రీ కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు ఏం కౌంట‌ర్ ఇస్తారో చూడాలి..!