KTR: తెలంగాణకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసులు పెడతారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంపై తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఫార్ములా-ఈ కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జైల్లో పెడితే యోగా చేసి.. పాదయాత్రకు సిద్ధపడతానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే నేను సిద్ధమే. రెండు. మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది? యోగా చేసుకుని బయటకు వస్తాను. తర్వాత పాదయాత్రకు సిద్దమవుతాను. టార్గెట్ కేటీఆర్ పై కాదు.. ప్రజా సమస్యలపై పెట్టాలి. ఏసీబీ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదు.. నాకు న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయి. విచారణకు గవర్నర్ అనుమతినిస్తే.. ఆయన విచక్షణకు వదిలేస్తా. రాజ్ భవన్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ బయట పడింది. బీఆర్ఎస్ ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
Also Read: Jagan Strong Warning: రాబోయేది మేమే.. ఎవ్వరినీ వదలం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
అయితే ఇటీవల కాంగ్రెస్ మంత్రి పొంగులేటి దీపావళి తర్వాత బీఆర్ఎస్ కీలక నేతలు అరెస్ట్ అవుతారని విదేశీ పర్యటనలో చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. అయితే దీపావళికి ముందు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు నానా యాగి చేసిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కేడర్ అప్రమత్తమైంది. కేటీఆర్‌పై లేనిపోని కేసులు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇకపోతే తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లే తెలుస్తోంది. అయితే కేటీఆర్ లాంటి ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న నాయకుడ్ని అరెస్ట్ చేస్తే అది ప్రభుత్వాన్నికే మంచి కాదని గతంలో ఎన్నో సందర్భంగా నిలిచాయి.