Telangana: అసెంబ్లీకి రాని కేసీఆర్‌ ప్రతిపక్ష నేత ఎలా అవుతారు: సీఎం

గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telangana: గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్య కారణాల రీత్యా అసెంబ్లీకి రావడం లేదని ఆ పార్టీ నాయకులు సమర్ధించుకుంటున్నప్పటికీ ఒక ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందేనని అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ను ప్రతిపక్ష నేతగా భావించబోమని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ కూడా కేసీఆర్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను ప్రతిపక్ష నేతగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం గులాబీ పార్టీపై మండిపడ్డారు. త్వరలో తమ ప్రభుత్వం పడిపోతుందన్న బీఆర్‌ఎస్‌ నాయకుల వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలంటే కేసీఆర్‌ నరేంద్ర మోదీతో చేతులు కలపాలని అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలు అమెరికాను పెద్దన్న’గా పిలుచుకున్నట్లే ప్రధానిని అన్నయ్యగా పేర్కొన్నానని, మొత్తం దేశానికి ప్రధాని అన్నయ్య అని అన్నారు రేవంత్. మోదీతో తెరవెనుక ఒప్పందం ఉందన్న ఆరోపణల్ని రేవంత్ తోసిపుచ్చారు. మోదీ నా బాస్ కాదు. రాహుల్ గాంధీ నాకు బాస్ అని రేవంత్ రెడ్డి అన్నారు.

కాళేశ్వరం అవినీతిలో 99 శాతం అధికారులు ప్రమేయం ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. దీంతో ప్రూవ్‌ చేసేందుకు అధికారుల కొరత ఏర్పడింది. అందుకే దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ)కి లేఖ రాసింది. నాలుగు వారాలు, నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తే వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్.

Also Read: Nara Lokesh : మంగళగిరి ఫై నారా లోకేష్ వరాల జల్లు..