Site icon HashtagU Telugu

Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించ‌నున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

Jagga Reddy

Jagga Reddy

హైదరాబాద్: నేడు సంచలన నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలపై తన సంచలన నిర్ణయం ప్రకటించిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. రేవంత్ రెడ్డిపై తన మాట‌ల దాడిని కొనసాగిస్తూ, టీపీసీసీ చీఫ్ వైఖరి కారణంగా పార్టీ అంతర్గత సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడనని పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటను ఉల్లంఘించాల్సి వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు.

రాష్ట్ర పార్టీ అధినేతకు రాజకీయ వ్యూహం ఉండాలని పేర్కొంటూ.. తెలంగాణలో పార్టీకి ఏదైనా నష్టం జరిగితే ఆయనపై నిందలు వేసే అవకాశం ఉంద‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రమేయం ఉన్న ఓటుకు నోటు కుంభకోణం బయటపడి తెలంగాణ నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అదృశ్యం కావడానికి రేవంత్ రెడ్డి కారణమని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పాటు అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలను పరోక్షంగా కలిశారంటూ సీనియర్ నేత వీ హనుమంతరావును టీపీసీసీ చీఫ్ టార్గెట్ చేసినప్పటి నుంచి జగ్గా రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.