Site icon HashtagU Telugu

IT Raids: ఐటీ తమ పని చేస్తోంది: కిషన్ రెడ్డి

It Raids

It Raids

IT Raids: కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటి దాడులు బీజేపీ చేయిస్తుందన్న వాదనలను కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. ఐటి తమ పని చేసుకుంటూ పోతుందని ఆరోపణలను తిప్పికొట్టారు.

కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు.అది మా పరిధిలో లేదు.. దాడుల గురించి కాంగ్రెస్ నేతలు చెప్తేనే తెలిసింది. చాలా ఏళ్లుగా ఐటీ తమ పని తాము చేసుకుంటోందని కిషన్ రెడ్డి అన్నారు. అంతకుముందు, టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటి దాడులపై అధికార పార్టీ బిఆర్ఎస్, బిజెపిపై మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకే పార్టీ అని, బీఆర్ఎస్ బీజేపీ బ్యాక్ ఎండ్ పార్టీ అని తెలుసుకోవాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని గౌరి సతీష్ అన్నారు.

ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని 10 చోట్ల పలువురు కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కే లక్ష్మారెడ్డి నివాసంలో సోదాలు జరిగాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్కంఠభరితమైన ముక్కోణపు పోటీ నెలకొంది.

Also Read: CPM : కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే బరిలోకి దిగుతున్న సీపీఎం

Exit mobile version