MLA Rasamayi: కేసీఆర్, కేటీఆర్ కంటే నేనే ఎక్కువ చదివా : ఎమ్మెల్యే రసమయి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన షాకింగ్ కామెంట్స్ రాజకీయాలలో ఆసక్తిని రేపుతున్నాయి.

  • Written By:
  • Updated On - December 7, 2022 / 10:56 AM IST

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (MLA Rasamayi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ‘‘తాను 80 వేల పుస్తకాలు చదివానని, డాక్టర్‌ బిఆర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని తిరగరాస్తానని’’ గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (CM KCR) కంటే తానే ఎక్కువ విద్యావంతుడని అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కె.తారకరామారావు, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌రావుల కంటే తానే ఎక్కువ చదువుకున్నవాడినని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు.

మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కన్నాపూర్‌లో జరిగిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సభలో రసమయి బాలకిషన్‌ పాల్గొని మాట్లాడారు. తాను కూడా అంబేద్కర్‌లా చదివి డాక్టరేట్‌, బంగారు పతకం సాధించానని అన్నారు. తాను నిరుపేద దళిత కుటుంబంలో పుట్టానని, ఉన్నత చదువులు చదివి డాక్టర్ రసమయి బాలకిషన్ గా మీ ముందు నిలిచానని అన్నారు. ఉపాధ్యాయునిగా పనిచేసి గోచీ, గొంగడి పెట్టుకుని పాటలు పాడేనని కూడా తెలిపారు.

మరోవైపు కరీంనగర్ జిల్లా గడ్డపాక గ్రామంలో రేషన్ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన రసమయి బాలకిషన్‌ను అఖిలపక్షం నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్యేను కలిసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఎమ్మెల్యేను కలవకుండా పోలీసులు అడ్డుకోవడంతో అన్ని పార్టీల నాయకులు ఆగ్రహించి రసమయి బాలకిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలోనూ రసమయి (MLA Rasamayi)పై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రసమయి వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

Also ReadSex Racket: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు!