తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించి మహిళల నుంచి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తాను మహిళా దర్బార్ నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఇదొక వేదిక అని గవర్నర్ పేర్కొన్నారు. మహిళా దర్బార్‌లో జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్‌పర్సన్ రేఖా శర్మ కూడా పాల్గొన్నారు.
కొన్ని మెడికల్ కేసులను చికిత్స కోసం వివిధ ఆసుపత్రులకు రెఫర్ చేసినట్లు తమిళిసై తెలిపారు. “భర్తలు విడిచిపెట్టిన మహిళలకు ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ సహాయం చేస్తారు” అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు సూచించినట్లు తెలిపారు. అయితే భారీ వర్షాల (క్లౌడ్ బరస్ట్) వెనుక వీదేశీ కుట్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది అది పెద్ద జోక్ అని ప్రతిపక్షాలు విరుచుకుపడగా, తమిళిసై మాత్రం నో కామెంట్స్ అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.