Site icon HashtagU Telugu

Central Minister Bandi Sanjay: ఆ ప‌ద‌వి నాకొద్దు.. కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు

Central Minister Bandi Sanjay

Central Minister Bandi Sanjay

Central Minister Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Central Minister Bandi Sanjay) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి త‌న‌కు వ‌ద్ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో లేనని, ఉండనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కన్నా.. పెద్ద బాధ్యతను పార్టీ ఇచ్చిందని, అది నెరవేర్చే పనిలో ఉన్నానని చెప్పారు. తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని మీడియాలో రావడం వల్ల తనకు వ్యక్తిగతంగా నష్టం కలుగుతోందన్నారు.

బండి సంజ‌య్ మాట్లాడుతూ.. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా. నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలే. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నా అని ఆయ‌న అన్నారు.

Also Read: SMAT Final 2024: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న ముంబై!

తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి!

తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి మొద‌లైంది. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని కొత్త‌వారికి ఇస్తే స‌హించేది లేద‌ని బీజేపీ నేత‌లు అంటున్న‌ట్లు స‌మాచారం. కొత్త‌వారికి ప్రాధాన్య‌త ఇస్తే అధిష్టానానికి లేఖ రాసి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామ‌ని బీజేపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా పార్టీని న‌మ్ముకున్నవారికి ప‌ద‌వులు ఇవ్వ‌కుండా కొత్త‌గా పార్టీలో జాయిన్ అయిన‌వారికి ప‌ద‌వులు ఇస్తున్న‌ట్లు ఆరోపిస్తున్నారు.

Exit mobile version