Raja Singh’s Bulletproof Car: నాకొద్దు ఈ బుల్లెట్ ఫ్రూఫ్.. ఐజీకి రాజాసింగ్ లేఖ!

ఇటీవల సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు.

Published By: HashtagU Telugu Desk
Rajasingh

Rajasingh

ఇటీవల సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు అందించిన ‘పాత’ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని కోరుతూ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజికి గురువారం లేఖ రాశారు. ‘‘ప్రస్తుతం నాకు కేటాయించిన వాహనం 2010 మోడల్, ఇది (13) సంవత్సరాల పాతది. అసెంబ్లీ సమావేశాలు, డిపార్ట్‌మెంట్ సమావేశాలు, ఇతర నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల వంటి అత్యవసర పనుల్లో వెళ్లేటప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తోంది” అని లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయమై అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును అనుమతి కోరుతున్నారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘పోలీసు శాఖ నిర్లక్ష్యమే కారణం. మీరు నాపై దాడి చేయడానికి ఉగ్రవాద సంస్థలకు, సంఘ వ్యతిరేకులకు అవకాశం ఇస్తున్నారు. నా జీవితాన్ని ప్రమాదంలో పడవేస్తున్నారు ”అని రాజాసింగ్ లేఖలో ప్రస్తావించారు. కావున అధికారులు తక్షణమే స్పందించి వాహనాన్ని మార్చాలని ఆయన కోరారు. ‘‘ఒకవేళ వాహనాన్ని అందించడంలో విఫలమైతే, దయచేసి నాకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోండి’’ రాజాసింగ్ ఘాటుగా స్పందించాడు.

  Last Updated: 17 Nov 2022, 03:11 PM IST