Site icon HashtagU Telugu

KTR Tweet: ఇకపై NDTV ని ఫాలోకాను.. కేటీఆర్ ట్వీట్!

Ktr

Ktr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌-భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చడం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అసలు విషయానికి వస్తే… టాప్ నేషనల్ మీడియా పోర్టల్ ఎన్‌డిటివిని తాను అన్‌ఫాలో చేస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే ధనవంతుడిగా పేరొందిన అదానీ ఎన్‌డిటివిని టేకోవర్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

అయితే గతంలో ఎన్‌డిటివి అన్ని సమయాలలో కేంద్ర వ్యతిరేక నిర్ణయాలను టార్గెట్ చేసి ప్రసారం చేసేది. ఫలితంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు మీడియా సంస్థకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఇప్పుడు అదానీ టేకోవర్ తర్వాత పరిస్థితులు మారుతాయని, ఎన్‌డిటివి కేంద్రం వ్యతిరేక కథనాలను ఆపవచ్చునని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదే దృష్ట్యా బీజేపీతో టగ్ ఆఫ్ వార్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎన్డీటీవీని అన్‌ఫాలో చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా ఛానెల్‌ని అదానీ టేకోవర్ చేయడంపై సోషల్ మీడియా లో స్పందిస్తూ “ఇప్పటి వరకు చేసిన మంచి పని. నేను @ndtvని ఫాలో కావడం లేదు” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై బీజేపీ నాయకులు, కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు.

Exit mobile version