Ponnala Lakshmaiah: కాంగ్రెస్ పార్టీకి సినీయర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారాక రామారావు పొన్నాల ఇంటికి వెళ్లారు. మద్యాహ్నాం రెండు గంటలకు పొన్నాల ఇంటికి బిఅర్ఎస్ నేతలు దానం నాగేందర్, దాసోజు శ్రవణ్ లతో కలిసి కెటిఅర్ వెళ్లారు. సీఎం కేసిఆర్ (KCR) ఆదేశాలతో ఆయన్ని బీఆర్ ఎస్(BRS) లోకి ఆహ్వానించామన్నారు మంత్రి కేటీఆర్. జనగామ సభలో చేరాలని చెప్పామన్నారు.
కేసిఆర్ తో సమావేశమై తన నిర్ణయం చెబుతామన్నారు. పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన కేకే, ds లాంటి వాళ్లకు పార్టీలో పదవులు ఇచ్చింది గౌరవించామన్నారు. Pv narsimharao సమక్షంలో ఆనాడు పొన్నాల లక్ష్మయ్య చేరారు. పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు అని చూడకుండా కాంగ్రెస్ పార్టీ అవమానంగా మాట్లాడారు, రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారలేదు ఆయన పార్టీ లు మారొచ్చు కానీ ఇతరులు గౌరవం లేకపోతే మారొద్దా అన్నారు.
ఇక కేటీఆర్ భేటీ తర్వాత పొన్నాల మీడియా ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్ని అని, రేవంత్ ఎవరు అని ప్రశ్నించారు. రేవంత్ కంటే ముందే పార్టీలో ఉన్నానని ఆయన అన్నారు. ఇక టికెట్ విషయమై మాట్లాడుతూ గతం ఎన్నికల్లో జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భర్య కూడా ఓడిపోయిందని, ఆ క్రమంలో నేను కూడా ఓడిపోయానని ఆయన గుర్తు చేశారు. అవమాన భారంతో పార్టీ నుంచి బయటకు వచ్చానని పొన్నాల అన్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని పొన్నాల అన్నారు.