Komatireddy Reaction: నేను కాంగ్రెస్ తోనే ఉంటా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్ ఇదే!

కాంగ్రెస్‌ పార్టీతో అసంతృప్తిగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో.. మునుగోడు

  • Written By:
  • Updated On - November 8, 2022 / 03:26 PM IST

కాంగ్రెస్‌ పార్టీతో అసంతృప్తిగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో.. మునుగోడు ఫలితాలు వెలువడిన మరుసటి రోజు తర్వాత పార్టీలోనే కొనసాగుతానని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. పార్టీ సీనియర్ నాయకులు చాలామంది భారత్ జోడో యాత్రలో చేరగా, చివరి రోజు కూడా కోమటిరెడ్డి దూరం కావడతో కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మునుగోడు ఉపఎన్నికకు ముందు తన సోదరుడు, బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దుతు ఇచ్చేందుకు ఇతర నేతలతో ఫోన్ కాల్స్ జరిపిన విషయం  తెలిసిందే. పార్టీ అక్టోబర్ 22, నవంబర్ 4 తేదీల్లో షోకాజ్ నోటీసులు జారీ చేసిందని ఎఐసిసి నాయకులు తెలిపారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ ఆ పార్టీ ఎంపీపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘పార్టీకి క్రమశిక్షణ ముఖ్యం. ఎవరైనా హద్దులు దాటితే ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందనడంలో సందేహం లేదు. మేం రెండు షోకాజ్ నోటీసులు జారీ చేసాం. అతను ఇంకా సమాధానం ఇవ్వలేదు. మా క్రమశిక్షణా చర్య కమిటీ (డిఎసి) తుది నిర్ణయం తీసుకుంటుంది” అని రమేష్ చెప్పారు.

కాగా, మీడియాకు దూరంగా ఉంటున్న వెంకట్ రెడ్డి తాను పార్టీని వీడేది లేదని ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో చెప్పారు. ‘షోకాజ్ నోటీసు’ సమస్య పెండింగ్‌లో ఉన్నందున, రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడోలో పాల్గొనడం సరికాదని అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో భాజపా టికెట్‌పై పోటీ చేసిన తన సోదరుడికి మద్దతిచ్చారనే ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వెంకట్‌రెడ్డిని ‘కోవర్ట్‌’ (ఏజెంట్‌)గా అభివర్ణించిన కాంగ్రెస్‌ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఉపఎన్నికలో తన ఓటమికి ఆయనే కారణమని ఆరోపించారు. ‘‘మా ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయింది. వెంకట్‌రెడ్డి కోవర్టు రాజకీయాలు ఆడుతూ తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని ఆమె నల్గొండలో మీడియాతో అన్నారు.