Site icon HashtagU Telugu

YS Sharmila Tweet : షర్మిల ఎమోషనల్ ట్వీట్.. కొడుకు, కుమార్తెకు అభినందనలు

Ys Sharmila Tweet

Ys Sharmila Tweet

YS Sharmila Tweet : కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజిలీ రెడ్డికి అభినందనలు తెలుపుతూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల ఎక్స్ (ట్విటర్)లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎకనామిక్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించినందుకు కుమారుడు రాజారెడ్డికి, బీబీఏ ఫైనాన్స్ డిగ్రీని సంపాదించినందుకు కుమార్తె అంజిలీ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు చెప్పారు. వాళ్లిద్దరూ త్వరగా ఉన్నతస్థానాలకు ఎదిగారని షర్మిల ఆకాంక్షించారు. తన ఇద్దరు పిల్లల గురించి చెప్పడం చాలా గర్వంగా, సంతోషంగా  ఉందని పేర్కొన్నారు. ‘‘నా అద్భుతమైన పిల్లలిద్దరూ విద్యాపరమైన  మైలురాళ్లను సాధించడం నాకెంతో సంతోషంగా ఉంది. వాళ్లిద్దరు చాలా త్వరగా ఉన్నతస్థానాలకు ఎదిగారు’’  అని తెలుపుతూ  షర్మిల(YS Sharmila Tweet) ట్వీట్ చేశారు.

డిగ్రీ పట్టాలు సాధించిన తన కుమార్తె, కుమారుడికి షర్మిల ఈసందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ‘‘ధైర్యం, నిజాయితీ కలిగిన హృదయాలతో మీరు ముందుకెళ్లండి. సత్యాన్ని గ్రహించండి.. సమగ్రతతో కూడిన జీవితాన్ని స్వీకరించండి. మీరు మీ లక్ష్యాలను చేరుకునేటప్పుడు మీ చుట్టూ ఉన్నవారిని గౌరవించండి. ఇతరుల ఆశీర్వాదం తీసుకొని వారిపట్ల గౌరవంగా ఉండండి’’ అని షర్మిల తన పిల్లలకు దిశానిర్దేశం చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఒక ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. అందులో షర్మిల కుమార్తె అంజిలీ రెడ్డి, షర్మిల కొడుకు రాజారెడ్డి, షర్మిల, బ్రదర్ అనిల్, విజయమ్మ ఉన్నారు. షర్మిల చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఎంతోమంది షర్మిల అభిమానులు, వైఎస్సార్టీపీ నేతలు కూడా షర్మిల పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు.