Site icon HashtagU Telugu

MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసిన ఎమ్మెల్యే హ‌రీష్ రావు..!

Former Minister Harish Rao

Former Minister Harish Rao

MLA Harish Rao: తెలంగాణ‌లో ప్ర‌స్తుతం నిరుద్యోగుల నిర‌స‌న‌లు తీవ్ర‌స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల మేర‌కు ఉద్యోగాల సంఖ్య‌ను పెంచాల‌ని డీఎస్సీ, గ్రూప్స్ ప‌రీక్ష‌ల పోస్టులు పెంచుతూ.. డీఎస్సీ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని నిరుద్యోగులు అశోక్‌న‌గ‌ర్‌లో రోడ్డెక్కారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. పోలీసులు సైతం నిరుద్యోగుల‌కు కంట్రోల్ చేయ‌లేక‌పోయారు. నిరుద్యోగులు సైతం పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లే కార‌ణంగా నిరుద్యోగులు రోడ్డెక్కిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై ప్రతిప‌క్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇప్ప‌టికే ప‌లుమార్లు కోరింది.

Also Read: PM Modi Giving Blessings: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల‌ను ఆశీర్వ‌దించిన ప్ర‌ధాని మోదీ.. వీడియో వైర‌ల్‌

తాజాగా మ‌రోసారి ఎమ్మెల్యే హ‌రీష్ రావు (MLA Harish Rao) నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై స్పందించారు. ఎక్స్ వేదిక‌గా సీఎం రేవంత్‌కు, కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఓ కోరిక కోరారు. ఎక్స్ వేదిక‌లో ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఏం రాశారంటే.. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నాను.

గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి.

పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుంది. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామ‌ని ఎమ్మెల్యే హ‌రీష్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.