తనదంతా రాజమౌళి (Rajamouli) స్టైల్ లో వర్క్ సాగుతుందని, RGV స్టైల్ లో వెళ్లమంటే వెళ్లే వ్యక్తిని కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మంగళవారం మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మూసీ నది పునరుజ్జీవంపై తన వాదనను మరోసారి పునరుద్ఘాటించారు. ప్రతిరోజూ 8 గంటల పాటు మూసీ ప్రక్షాళనపై దృష్టి సారించేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూసి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ఇప్పటికే 33 బృందాలతో సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు ఉచిత విద్య, మూసీ చుట్టూ నైట్ సిటీ, రాత్రి మార్కెట్ ఏర్పాట్లను ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ లో బాపు ఘాట్ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు, మొదటి దశలో కేబుల్ బ్రిడ్జి, బ్యారేజీ ఏర్పాట్లతోపాటు మహాత్మా గాంధీ విగ్రహం నిర్మాణం జరగనున్నట్లు వివరించారు. అఖిలపక్ష సమావేశం ద్వారా మూసీ పునరుజ్జీవంపై చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. తనకు ఏఐసీసీతో ఎటువంటి విభేదాలు లేవని, రాష్ట్రంలో తానే ఏఐసీసీ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రకటించి, రేపు విస్తరణ ఉంటుందన్న వార్తలకు విరామం కల్పించారు.
దీపావళి సందర్భంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదిని ఉద్దేశించి సారా బుడ్లను ఉటంకిస్తూ విమర్శించారు. సీఎం రేవంత్ మోకీలా కేసుపై స్పందిస్తూ, దావత్ గురించి గతంలో తమకు ఎవరూ తెలియజేయలేదని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవంపై విమర్శలు చేస్తున్న కేటీఆర్, హరీష్ రావులను సవాల్ చేస్తూ, వాడపల్లి నుండి వికారాబాద్ వరకు పాదయాత్రకు సిద్ధమని, ఈ యాత్రలో వారిని ఆహ్వానించారు.
Read Also : CM Revanth Reddy : తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం కీలక ప్రకటన
