Site icon HashtagU Telugu

Karne Prabhaker : నేను పార్టీ మారడం లేదు…టీఆర్ఎస్ లోనే ఉంటా..!!

Karne Prabhakar

Karne Prabhakar

మునుగోడ ఉపఎన్నిక ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ గా మారాయి.

టీఆర్ఎస్ నేతలు బీజేపీకిలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా బీజేపీలోకి చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై స్పందించారు కర్నె ప్రభాకర్ రెడ్డి. ఓ వీడియోను షేర్ చేస్తూ….మునుగోడులో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ అసత్య ప్రచారాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కడతారన్నారు.