Site icon HashtagU Telugu

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

Revanth Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు ప్రజల తిరస్కరణకు గురయ్యారని, అలాంటి వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఆయనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి, “సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావు వెనుక ఉన్నారు” అని తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన సీఎం, తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు.

నాకు ప్రజలే ప్రాధాన్యం. ఇప్పటికే ప్రజలు బీఆర్ఎస్ నేతలను తిరస్కరించారు. అలాంటి వారితో నాకెలా సంబంధం ఉంటుంది? నేను ఎవరి వెనుకా లేను. కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు. సీఎం వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి సమాధానం ఇచ్చారని, తమ ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా అభివృద్ధి, పారదర్శక పాలనవైపే అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఇటీవల బీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర అంతర్గత ఒడిదుడుకులకు గురవుతోంది. పార్టీలో ఆంతర్య పోరాటాలు, నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక, పై రాష్ట్ర రాజకీయాల్లో పాత వాదనలు, కుటుంబ ప్రాధాన్యతలతో కూడిన నాయకత్వం ప్రజలు అంగీకరించరని, తాను మాత్రం పూర్తిగా ప్రజల భద్రత, అభివృద్ధి కోసమే పనిచేస్తానని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో, రేవంత్ ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజల మద్దతును మరింత కట్టిపడేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

కాగా, కాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది.

Read Also: AP : మద్యం కేసు..వైసీపీ నేతల ఇళ్లలో సిట్‌ సోదాలు ముమ్మరం