తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన సొంతూరు కొండారెడ్డిపల్లి(Kondareddypalli )ని సోమవారం సందర్శించారు. తన రాజకీయ ప్రస్థానానికి ఊపిరిగా నిలిచిన ఈ గ్రామాన్ని ఆయన ఎంతో భావోద్వేగంతో పరిగణిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన తన పర్యటనకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమ వేదిక అయిన X (గతంలో Twitter) లో పంచుకున్నారు.బిడ్డకు తల్లి స్వాగతం పలికినట్టు…
కొండారెడ్డి పల్లి ఆత్మీయంగా
ఆలింగనం చేసుకుంది…
నా ఊరు, నా వాళ్ల మధ్యకు
ఎప్పుడు వెళ్లినా…
అనిర్వచనీయ అనుభూతే.
ఊరి పొలిమేరల్లో…
హనుమంతుడి ఆశీస్సులు…
ఆధ్యాత్మిక అనుభూతి.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన
శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్,
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టీ విక్రమార్క
మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
శ్రీ దామోదర రాజనర్సింహ,
శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,
శ్రీ పొన్నం ప్రభాకర్ ,శ్రీ జూపల్లి కృష్ణారావు
శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,
శ్రీమతి సీతక్క ,శ్రీమతి కొండా సురేఖ ,
ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు,
ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు ” అంటూ పోస్ట్ చేసారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, తన సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హారతులు, గజమాలలతో సీఎంను పలకరించడమే కాక, వారి ప్రేమాభిమానాన్ని అంతులేని ఆదరాభిమానంతో చాటిచెప్పారు. తన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన గ్రామస్థులకు భరోసా ఇచ్చారు.
రేవంత్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చేసిన కృషి స్థానిక ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. చిన్న గ్రామం నుండి సీఎం పదవికి ఎదిగిన వ్యక్తిగా, తన జ్ఞాపకాలతో, ప్రజల అనురాగంతో ఈ పర్యటన మరింత గుర్తుంచుకోదగినదిగా మారింది. కొండారెడ్డిపల్లిలోని ప్రజలు కూడా తమ గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నారు.
జన్మనిచ్చింది…
ఆజన్మాంతం ప్రేమను చూపుతోంది…
హారతితో… గజమాలలతో…
అవదులు లేని…
అభిమానం చాటుతోంది…
నా కొండారెడ్డిపల్లి.
సదా రుణపడి ఉంటా.#Kondareddypally pic.twitter.com/70t2lJlZZX— Revanth Reddy (@revanth_anumula) May 20, 2025