హైడ్రా (Hydraa) కూల్చివేతలతో గుండెపగిలి బాధితురాలు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ నెల 8న సున్నంచెరువు (Sunnam Cheruvu) కూల్చివేతలతో తన గుడిసె కోల్పోయిన అంజలి (Anjali) అనే మహిళ తన సోదరుడి ఇంటికి తల దాచుకోవడానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది. హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అంటూ హైడ్రా పేరిట నిర్మాణాలు కూలుస్తూ..ప్రజల్లో ఆగ్రహపు జ్వాలలు పెంచుతుంది రేవంత్ సర్కార్. కేవలం హైదరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటోడినా గెలిపించుకుంది అని బాధపడుతున్నారు. మార్పు అంటే ఇదేనా అని ఓట్లు వేసిన వారంతా మాట్లాడుకుంటున్నారు. పేదోడికి ఇల్లులు కట్టించిన ప్రభుత్వాలను చూసాం కానీ..పేదోడి ఇల్లులు కూల్చేసి మాయదారి రేవంత్ సర్కార్ ను చూస్తున్నాం అంటూ తిట్లదండకం చేస్తున్నారు.
హైడ్రా కూల్చివేతల్లో పెద్దల ఇండ్లను వదిలి మధ్యతరగతి వారు సామాన్యుల ఇండ్లను కూల్చేస్తున్నారని వారంతా గగ్గోలు పెడుతున్నారు. పెద్దల నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి.. పేదల ఇండ్లకు మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లోని సామాన్లు కూడా తీసుకోవటానికి సమయం లేకుండా ఉన్నపళంగా కూల్చేస్తున్నారని వాపోతున్నారు. తమ ఇంటిని కూల్చే అధికారం ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు కట్టుకున్నవారే కాదు.. స్థలాలు, నిర్మాణాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నవారూ హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చి.. కడుపు కట్టుకుని సంపాదించుకుంటున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న షెడ్లను, భవనాలను ఉన్నట్టుండి కూల్చడంతో.. తీవ్రంగా నష్టపోయామని, ఇక తమ బతుకులు కోలుకునే అవకాశమే కనిపించడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు.
ఈ నెల 8న సున్నంచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోని ఒక గోడౌన్, మూడు భవనాలు, 20 గుడిసెలను అధికారులు కూల్చివేశారు. అందులో ఒక గుడిసెలో నివాసం ఉంటున్న బలహీనవర్గాలకు చెందిన ఎన్.నర్సింహ, అంజలి దంపతులు ఇరవయ్యేళ్ల క్రితం మాదాపూర్‌కు వలస వచ్చారు. అక్కడ గుడిసె వేసుకొని కూలిపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి కుమారుడు సాయిచరణ్ (17) కేన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు నెలల క్రితమే మృతిచెందాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోకముందే వారి గుడిసె నేలమట్టమైంది. తలదాచుకునేందుకు నర్సింహ సోదరి ఇంటికి వెళ్ళింది. కానీ అటు కుమారుడిని, ఇటు గూడును కోల్పోయిన ఆవేదనతో.. అంజలి ఈనెల 21న ఛాతీనొప్పికి గురైంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ కూల్చిన గుడిసె వద్దకు వచ్చిన నర్సింహ.. కొడుకు, భార్య ఇద్దరూ మరణించాక, తాను ఎవరి కోసం బతకాలో అర్థం కావడం లేదని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.
Read Also : IPL 2025: ఐపీఎల్ 2025.. కొత్త సీజన్‌లో మొత్తం ఎన్ని మ్యాచ్‌లు అంటే..?