Site icon HashtagU Telugu

Ameenpur Municipality : ఆక్రమణలపై నిగ్గుతేల్చేందుకు హైడ్రా స‌ర్వే

Ameenpur Municipality

Ameenpur Municipality

అమీన్పూర్ మున్సిపాలిటీ(Ameenpur Municipality)లో ఆక్రమణలపై నిగ్గుతేల్చేందుకు హైడ్రా(Hydraa) స‌ర్వే చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వే ద్వారా పార్కులు, రహదారులు, ప్ర‌భుత్వ స్థ‌లాలపై జరిగిన ఆక్రమణల‌ను గుర్తించి, కాపాడే ప్రయత్నం జరుగుతోంది. రీసెంట్ గా వెంకటరమణ కాలనీ వాసులు, గోల్డెన్ కీ వెంచ‌ర్స్‌పై ఆక్రమణలు చేసారని ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో సర్వే నెంబర్ 152, 153 వద్ద హైడ్రా సర్వే నిర్వహించగా, పార్కులు, రహదారులు కబ్జా అయ్యాయని నిర్ధారించారు. గోల్డెన్ కీ వెంచ‌ర్స్ నిర్వాహకులు చొరబడి ఆక్రమణలు చేసినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది.

ICC Mens ODI Team: ఐసీసీ పురుషుల వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఇదే.. టీమిండియాకు షాక్‌!

ఈ విషయంలో మరింత లోతైన సర్వే చేయాలనుకుంటున్న హైడ్రా, కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ స‌ర్వే ఆఫ్ ఇండియా, ఏడీ స‌ర్వే సంయుక్తాధ్వ‌ర్యంలో జాయింట్ స‌ర్వే చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఇతర కాల‌నీల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. హైడ్రా అధికారుల ప్రకటన మేరకు ఈ సర్వే పారదర్శకంగా జరగాలని, ప్రజలు అందరికి భాగస్వామ్యం కావాలని కోరింది. గోల్డెన్ కీ వెంచ‌ర్స్ నిర్వాహకులు తమ అక్రమ కార్యకలాపాలను కప్పి పుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించవద్దని హైడ్రా హెచ్చరించింది.

ప్రస్తుతం ఈడీ సంస్థ గోల్డెన్ కీ ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. స‌ర్వేలో భాగంగా, ఆర్టీసీ కాల‌నీ, రంగారావు వెంచ‌ర్, చ‌క్ర‌పురి కాల‌నీ వాసులైనా క‌బ్జాలు ఉంటే, వారు కూడా ఫిర్యాదు చేయాలని హైడ్రా సూచించింది.