బ్యాంకులకు ( Banks On Home Loan) హైడ్రా (Hydraa) కీలక సూచన తెలియజేసింది. అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని సూచించింది. ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చేస్తు వస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణమని తేలితే చాలు..ఏమాత్రం ఆలోచించకుండా , నోటీసులు వంటివి కూడా జారీ చేయకుండా కూల్చేస్తు వస్తున్నారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చేసింది.
ఆదివారం కూకట్పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలను కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అలాగే అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యాపార కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించగా వాటిని కూల్చేసింది. అయితే తామంటూ రెంట్ కు ఉంటున్నామని ,కనీసం తమ సామాన్లు తీసుకోవాలనికైనా సమయం ఇవ్వాలని , సడెన్ గా కూల్చేస్తే ఎలా..? తమకు ఇది ప్రభుత్వ భూమి అని , కబ్జా భూమి అని తెలియదు కదా..? ప్రభుత్వ అనుమతులు తీసుకొనే బ్యాంకుల్లో లక్షల లోన్ తీసుకొని కట్టుకున్నామని బాధితులు వాపోతున్నారు.
ఈ క్రమంలో హైడ్రా ..బ్యాంకులకు కీలక సూచనను తెలియజేసింది. అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాసింది. రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో సమావేశమై సూచనలు చేయనున్నారు. దీని కోసం ఒక లీగల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల కూల్చిన అక్రమ కట్టడాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల లిస్టును సిద్ధం చేశారు.
Read Also : Weekly 55 Hours Work : ప్రపంచంలో అత్యంత శ్రమజీవులు భారత మహిళలే.. వారానికి 55 గంటల పని