Site icon HashtagU Telugu

Hydra : సుప్రీంకోర్టు లాయర్‌కు హైడ్రా రంగనాథ్ వార్నింగ్

Ranganath Serious Warning T

Ranganath Serious Warning T

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు ఏర్పాటైన హైడ్రా (Hydraa) సంస్థ ఇప్పుడిప్పుడే ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) నేతృత్వంలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటికి పరిష్కారం చూపే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 07న) అమీన్‌పూర్ మున్సిపాలిటీలో రంగనాథ్ పర్యటించారు. ఈ పర్యటనలో ఐలాపూర్ రాజగోపాల్‌నగర్, చక్రపురి కాలనీల అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన రంగనాథ్ ..స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల ఫిర్యాదుల మేరకు ఆయా స్థలాలను పరిశీలించి, వారి సమస్యలు సమగ్రంగా తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

Hardik Pandya: టీమిండియా వ‌న్డే, టీ20 జ‌ట్ల‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా?

అయితే ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం మధ్య తీవ్ర వాదన జరిగింది. బాధితుల సమస్యలు వింటున్న సమయంలో కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పరిశీలించేందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అలాగే ప్లాట్లకు సంబంధించిన పలు ఆధారాలను రంగనాథ్‌కు చూపిస్తూ, “మీరు తెలుగు చదవగలరా?” అని ప్రశ్నించారు. దీనికి రంగనాథ్ ఘాటుగా స్పందిస్తూ “నేను తెలుగు మాత్రమే కాదు, అన్నీ చదవగలను. మీరు చెప్పాల్సిందే చెప్పండి, ఓవరాక్షన్ చేయకండి. అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు” అంటూ న్యాయవాది ముఖీంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని, న్యాయవ్యవస్థను గౌరవిస్తూ తమ విధులను నిర్వర్తిస్తున్నామని రంగనాథ్ స్పష్టం చేశారు.