Hydra : మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి హైడ్రా నోటీసులు

ఇప్పటికే ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Published By: HashtagU Telugu Desk
Kotha Prabhakar Reddy

Kotha Prabhakar Reddy

Hydra: గత పది రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా ‘హైడ్రా’ పేరు వినిపిస్తోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ‘హైడ్రా’ ఉక్కుపాదం మోపతూ ముందుకు సాగతుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు హైడ్రా పలువురు ప్రముఖుల అక్రమణాలను కూల్చివేసింది. మొదట మాజీ కేంద్రమంత్రి పళ్ళం రాజుతో మొదలుపెట్టిన హైడ్రా ఇప్పటివరకు ప్రభుత్వానికి చెందిన 43 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఇప్పుడు హైడ్రా మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాపై ఫోకస్ పెట్టింది. ఈ దుర్గం చెరువును ఆనుకొని కట్టిన కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. నెల రోజులలోపు ఈ నిర్మాణాలు తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసులలో వివరించారు.

అయితే ఈ నోటీసులు అందుకున్న వారిలో చాలామంది ఐఏఎస్ అధికారులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Hydra Effect : హడలిపోతున్న దుర్గంచెరువు వాసులు

  Last Updated: 29 Aug 2024, 03:13 PM IST