Site icon HashtagU Telugu

Hydra : హైడ్రా నెక్స్ట్ టార్గెట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లేనా..?

Hydra Next Target Brs Leade

Hydra Next Target Brs Leade

హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వెతు… ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా ప్రతిఘటిస్తూ హైడ్రా దూసుకెళ్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే హైడ్రా పట్ల నెటిజన్లు , సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాగే ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. మూడు రోజుల క్రితం నటుడు నాగార్జున కు సంబదించిన N కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేసి ప్రజల్లో నమ్మకం పెంచుకుంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎస్‌సీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది.

ఇదిలా ఉంటె సెక్సీ హైడ్రా టార్గెట్ బిఆర్ఎస్ నేతల కట్టడాలే అని అంత మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ ది అని ప్రచారం జరుగుతోన్న జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చివేతకు ఉపక్రమించినా హైకోర్టు ఆదేశాలతో హైడ్రా ఆగిపోయింది. లేకపోతే నాగార్జున కంటే ముందే కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేసేవారు. ఇక , బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా , మల్లారెడ్డిల విద్యా సంస్థలపై హైడ్రా ఫోకస్ పెట్టిందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే చెరువులను ఆక్రమించి బఫర్ జోన్ లో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నిర్మించారని విద్యాసంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి నాదం చెరువు ఆక్రమించి అనురాగ్ విద్యాసంస్థలను నిర్మించారని కేసు నమోదు అయింది. పిర్యాదులు వచ్చిన , హై కోర్ట్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అనురాగ్ విద్యాసంస్థలు అనే ప్రచారం జరుగుతుంది.

Read Also : Kim Jong Un : సంబరపడుతున్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. సూసైడ్‌ డ్రోన్‌‌ రాకతో జోష్