Site icon HashtagU Telugu

CM Revanth : మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి హైడ్రా నోటీసులు

CM Revanth

Cm Revanth

CM Revanth : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌‌లో  ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలు చేసిన వారిపై హైడ్రా విభాగం కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా హైడ్రా మరో సంచలనానికి తెరతీసింది. స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth) సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి హైడ్రా అధికారులు నోటీసులను అంటించారు. మాదాపూర్‌‌లోని అమర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటికి సంబంధించిన నోటీసులను జారీ చేశారు. కట్టడాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నందున  స్వచ్ఛందంగా 30 రోజుల్లోగా కూల్చేయాలని నోటీసుల్లో రెవెన్యూ అధికారులు కోరారు.

We’re now on WhatsApp. Click to Join

దుర్గంచెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్‌ సొసైటీలలోని వందలాది ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్సుల యజమానులకు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌/ తహసీల్దార్‌‌లు నోటీసులను జారీ చేశారు.వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద వారందరికీ  తాఖీదులు ఇచ్చారు. ఇళ్లు చెరువు శిఖం భూములలో ఉన్నందున నెల రోజుల్లోగా వాటిని స్వచ్ఛందంగా కూల్చేయాలని ఆదేశించారు. లేదంటే తామే కూల్చివేతలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read :Rajasekhar : మగాడు టైటిల్ తో యాంగ్రీ యంగ్ మ్యాన్..!

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) వేసిన హద్దురాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. వాటిని దాటేసి చెరువు సగం భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకు పోయాయని అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువు చాలా ఫేమస్. హైటెక్‌సిటీ నిర్మాణం తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్ల నివాసాలు ఉండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది వాటి జోలికి వెళ్లడం లేదు.

Also Read :Balakrishna : పుష్ప రాజ్ తో ఢీ కొడుతున్న బాలయ్య..?

Exit mobile version