హైదరాబాద్ నగరంలో ‘హైడ్రా’ (HYDRA ) బుల్డోజర్లు హడలెత్తిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు అని పిర్యాదు అందితే చాలు చాలు వెంటనే ఆ నిర్మాణాల ఇంటి ముందు బుల్డోజర్లు అడుగుపెడుతున్నాయి. నోటీసులు వంటివి ఏమి లేకుండా కూల్చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..ఈరోజు రామ్ నగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చేసే పనిలో పడ్డాయి. రాంనగర్ (Ramnagar ) లోని మణెమ్మ బస్తీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని GHMC రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో శుక్రవారం ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఫై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (Hydra) వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..తాజాగా వందలమందికి నోటీసులు జారీ చేసారు. ఇందులో అధికార పార్టీ నేతలు, సినీ ప్రముఖులు , బిజినెస్ రంగంవారు ఇలా చాలామందే ఉన్నారు.
Read Also : Barinder Sran Retirement: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ బౌలర్