Site icon HashtagU Telugu

Hydraa : హైడ్రా కూల్చివేతలు..సామాన్య ప్రజల రోదనలు

Hydraa Kp

Hydraa Kp

Hydra Demolitions in Hyderabad : హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేసి పనిలో పడింది. గత కొద్దీ రోజులుగా నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కొలుస్తూ వస్తుంది. ఈరోజు కూడా మూడు చోట్ల 44 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

కాగా హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఇది అధికారుల తప్పే. వాళ్లు కట్టడానికి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అకారణంగా కూల్చివేసి మా కుటుంబాల్ని రోడ్డున పడేశారని విలపిస్తున్నారు. తామంతా అద్దెకు ఉంటున్నామని , ల్యాండ్ లీజ్ కు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నామని , లక్షల అప్పులు చేసి వ్యాపారం మొదలుపెట్టామని..ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తే..ఎలా అని వారంతా వాపోతున్నారు.

ఆదివారం జరిగిన కూల్చివేతలకు సంబంధించి హైడ్రా విసరణ ఇచ్చింది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. కూకట్​పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించామని, వాటిని కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యాపార కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించారని హైడ్రా పేర్కొంది. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో మూడు అంతస్తుల భవనాన్ని కూల్చివేశామని, అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. అలాగే పటేల్​గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వాటిని తొలగించి 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

Read Also : Raj Thackeray : పాకిస్తాన్ సినిమాను రిలీజ్ చేస్తే ఖబడ్దార్.. థియేటర్లకు రాజ్‌థాక్రే వార్నింగ్