Site icon HashtagU Telugu

HYDRA Demolishing @ Kavuri Hills Park : కావూరి హిల్స్ లో అక్రమాలను కూల్చేస్తున్న ‘హైడ్రా’

Hydra Demolishing Illegal C

Hydra Demolishing Illegal C

‘హైడ్రా’ (HYDRA ) తగ్గేదేలే అంటూ అక్రమ కట్టడాలను కూల్చేస్తు (Demolishing ) అక్రమరాయుళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేసి పనిలో పడింది. గత కొద్దీ రోజులుగా నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కొలుస్తూ వస్తుంది. నిన్న కూకట్​పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలను కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అలాగే అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యాపార కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించగా వాటిని కూల్చేసింది.

ఇక ఈరోజు..సోమవారం మాదాపూర్​లోని కావూరి హిల్స్​ పార్కు (Kavuri Hills Park) స్థలంలోని అక్రమ షెడ్లను హైడ్రా కూల్చేసింది. ఇక్కడ స్పోర్ట్స్​ అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్​ అకాడమీపై కావూరి హిల్స్​ అసోసియేషన్​ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్​ అసోసియేషన్​ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్​ పార్కు పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్​ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.

Read Also : Silk Smitha Death Anniversary : వెండితెర కన్నీటి చుక్క..’సిల్క్ స్మిత’