N convention: హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వివాదాస్పదం అవుతోంది. అది పట్టా భూమి అని, అందుకే నిర్మాణం చేపట్టినట్లు నాగార్జున చెబుతున్నారు. కోర్టులో స్టే ఉన్నా, హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారని ఆయన ఆరోపించారు. అయితే అక్కడ భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినట్లు హైడ్రా స్పష్టం చేసింది. కూల్చివేతపై కీలక ప్రకటన చేసింది. FTL పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటల భూమిని ఎన్ కన్వెన్షన్ ఓనర్ ఆక్రమించినట్లు హైడ్రా తెలిపింది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాక.. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ లోని కట్టడాలను కూల్చివేశం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదు. హైకోర్టులో స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది పూర్తిగా అవాస్తవం అని ఆయన అన్నారు. ఎఫ్టిలో కట్టడాలు ఉన్నందునే కూల్చి వేయడం జరిగింది. చెరువుని పూర్తిగా కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేశారు. కాబట్టి చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి కట్టడాలని కూల్చివేశం అని రంగనాథ్ తెలిపారు. అయితే కట్టడాలని క్రమబద్ధీకరన చేసేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించింది. కానీ ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ ని అధికారులు గతంలోనే తిరస్కరించారు. అయితే ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ పైన లోకా యుక్త పాటు హైకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ లో పూర్తిగా అన్ని కట్టడాలని నేలమట్టం చేశాం. కాబట్టి ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరో గా మారింది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు.
కాగా, తమ్మిడికుంట చెరువు మరియు చుట్టుపక్కల మాదాపూర్, హై టెక్స్ పరిసర ప్రాంతాలను అనుసంధానించే నాలాలలో తనిఖీలు చేయని ఆక్రమణల కారణంగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నీటి నిల్వ సామర్థ్యం 50-60% మేర కుంచించుకుపోవడంతో తమ్మిడికుంట చెరువు దిగువ ప్రాంతాలు నిత్యం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ముంపునకు గురవుతున్నాయి. దిగువ మరియు మధ్యతరగతి ప్రజల యొక్క అనేక ఇళ్ళు ఈ దిగువ ప్రాంతాలలో మునిగిపోతున్నాయి, ఫలితంగా వారికి తీవ్ర ఆస్తి నష్టం జరుగుతుంది. నిర్ణీత ప్రక్రియను అనుసరించి,నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఈరోజు ఉదయం తమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. తెలంగాణ హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం మధ్యంతర స్టే ఇచ్చింది.