Site icon HashtagU Telugu

Hydraa : లక్షలాది మంది క్షేమం కోసం పాటుపడేదే హైడ్రా – కమిషనర్ రంగనాథ్

Hydra Commissioner Ranganat

Hydra Commissioner Ranganat

HYDRA Commissioner Ranganath Full Clarity on Hydraa Demolishes : గత మూడు రోజులుగా హైడ్రా (Hydraa) ఫై నగరవ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతలను , బడా బాబులను వదిలి సామాన్య ప్రజల ఫై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని..ఎన్నో ఏళ్ల గా ఉంటున్న నివాసాలను కూలుస్తామని హెచ్చరిస్తున్నారని బాధితుల ఆరోపిస్తున్నారు.

ఇదే సందర్బంగా రేవంత్ సర్కార్ (Congress Govt) ఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కాగా హైడ్రాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఫై రంగనాధ్ సీరియస్ అయ్యారు. హైడ్రా కొంతమందికి మాత్రమే వ్యతిరేకత ఉందని , హైడ్రా బూచి కాదని భరోసా ఇచ్చే సంస్థ అని, లక్షలాది మంది క్షేమం కోసం పాటుపడేదే హైడ్రా అని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో రంగనాథ్ (Hydra Commissioner Ranganath) మీడియాతో మాట్లాడి అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

కొందరు ఉద్దేశపూర్వకంగా తమపై దుష్ప్రచారం

హైడ్రా సైలెంట్ కాదు.. గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే ఏ కట్టడాన్ని వదిలేది లేదు.. బుచ్చమ్మ ఆత్మహత్య నన్ను ఎంతగానో కలచి వేసింది.. పెద్దలు వెనుక ఉండి, పేదలను ముందుకు పంపుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. ఇప్పటివరకూ హైడ్రా కూల్చిన ఏ భవనానికి సైతం జీహెచ్ఎంసీ సహా సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్లు లేవని రంగనాథ్ స్పష్టం చేశారు. 2 నెలల నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని, నిబంధనల ప్రకారం వెళ్తున్నా.. కొందరు ఉద్దేశపూర్వకంగా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో హైదరబాద్ వాసులే బాధితులు అవుతారని పేర్కొన్నారు.

అమీన్ పూర్ విల్లాలకు ఎలాంటి పర్మిషన్ లేదు

అమీన్ పూర్ విల్లాలకు ఎలాంటి పర్మిషన్ లేదు. అక్కడ నిర్మాణాలకు పర్మిషన్ ఎప్పుడో రద్దు చేశారు. అవి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న కారణంగా గత ప్రభుత్వంలోనూ వాటికి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. అవి మొత్తం కొనేది ఓ వ్యక్తి ఉంటాడు, పర్మిషన్ లేదని చెప్పినా వాళ్లు మేనేజ్ చేసి అనుమతులు ఉన్నట్లు చూపిస్తాడు. ఆ ల్యాండ్ అమ్మి, అక్కడ విల్లాలు నిర్మించారు. నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలను, పర్మిషన్ లేకున్నా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నాం. ఇప్పుడు కూల్చివేతలతో ఇక్కడితోనే పోతుంది. లేకపోతే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా, వరదలు వస్తే భారీ స్థాయిలో నష్టం కలుగుతుందన్నారు. తప్పుడు పత్రాలతో వాటిని విక్రయించి ఎంతో మంది జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టిన వారే అసలైన దోషులని స్పష్టం చేశారు.

త్వరలో పెద్దలే టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు

మేం సైలెంట్ గా ఉన్నామని, పెద్దల జోలికి వెళ్లడం జోలికి వెళ్లడం లేదని మీకనిపిస్తోంది. కానీ దీనిమీద బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. పెద్దలే టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు త్వరలో జరగనున్నాయి. అది చూసి మీరే ఆశ్చర్యపోతారని.. ఒవైసీ బ్రదర్స్ కు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం లేదన్న ఆరోపణలపై ఈ విధంగా స్పందించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలో పర్మిషన్ ఇచ్చారన్నది నిజం కాదు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ ఇచ్చినట్లు తేలితే అధికారులను అరెస్ట్ చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ సెక్రటరీని అరెస్ట్ చేశాం. బిల్డర్ పై కేసు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు. అనుమతి తీసుకునేది ఓ చోట అయితే నిర్మాణాలు చేపట్టేది మరోచోట అని స్పష్టం చేశారు. అందువల్లే ఈ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోందని క్లారిటీ ఇచ్చారు.

హైడ్రాను వ్యతిరేకంగా చూపించే సమయంలో మీడియా ముందుగా ఆలోచించాలన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో.. ఆ ఇంటి యజమానులను బాధితులుగా తెలుపుతున్నారని.. వరదల సమయంలో అక్రమ కట్టడాల వల్ల నగరాలు నీటిమునిగితే అప్పటి బాధితుల సంగతి ఏమిటి అంటూ ప్రశ్నించారు. పలువురు బిల్డర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని, తాము నోటీసులు ఇచ్చే క్రమం నుండి.. కూల్చివేతల వరకు ప్రతిదీ రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.

రోజుకు లక్ష సంపాదించే వెంకటేష్..పేదవాడా..?

సున్నం చెరువులో కిరోసిన్ పోసుకున్న వెంకటేష్ అనే యువకుడు రోజుకు లక్ష రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నట్లు, అతను ట్యాంకర్ల వ్యాపారం చేస్తున్నట్లు తాము గుర్తించమన్నారు. రోజుకు లక్ష రూపాయలు సంపాదించేవారు పేదలవుతారా అంటూ రంగనాథ్ ప్రశ్నించారు. జిహెచ్ఎంసి అనుమతులు ఉంటే తాము వాటి జోలికి వెళ్లట్లేదని.. అయితే ముందస్తుగా తాము సమాచారం ఇస్తే కొందరు సీరియస్ గా తీసుకోవట్లేదన్నారు. మరికొందరు ముందస్తుగానే ఖాళీ చేస్తూ.. తమకు సహకరిస్తున్నట్లు తెలిపారు.