‘హైడ్రా’ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ..ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ భూ అక్రమాలపై ఫోకస్ పెట్టింది. చెరువులు , ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిఫై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ‘హైడ్రా’ ను తీసుకొచ్చింది. దీనికి కమిషనర్ గా రంగనాధ్ ను ఏర్పాటు చేసింది. ఈరోజు మాదాపూర్ లోని నాగార్జున కు చెందిన N కన్వెన్షన్ ను కూల్చివేయడం తో ‘హైడ్రా’ రంగనాథ్ పేరు మారుమోగిపోతుంది. ఎవరు ఈ రంగనాధ్..? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఎక్కడి నుండి వచ్చారు..? ఇది వరకు ఏంచేసాడంటూ అరా తీస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రంగనాథ్ 1970లో నల్గొండలో జన్మించారు. 1996లో డీఎస్పీగా ఎంపికైన రంగనాథ్ కుతొలుత గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా పోస్టింగ్ వచ్చింది. తర్వాత కొత్తగూడెం, నర్సంపేట, మార్కాపురం డీఎస్పీగా పనిచేశారు. 2012లో తూ.గో అడిషనల్ ఎస్పీగా గ్రేహౌండ్స్ ఆపరేషన్లను సమర్థవంతంగా డీల్ చేశారు. దీంతో ఆయనకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది.
2007లో ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా (ఇబ్రహీంపట్నం) హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే తెలంగాణలోని నల్గొండలో అమృత-ప్రణయ్ కేసులో నిందితుడు మారుతిరావు అరెస్టు, విచారణను సమర్థంగా నిర్వహించారు. వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును ఆయనే డీల్ చేసి నిందితుడు సైఫ్ ను త్వరగా అరెస్టు చేశారు. ఇలా ఈయన బ్యాక్ గ్రౌండ్ ఎంతగానో ఉండడం తో రేవంత్ సర్కార్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు అప్పటించింది. ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ.. తన మార్క్ చూపిస్తున్నారు రంగనాధ్.
Read Also : Vande Bharat Sleeper : త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు