ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్‌బి నగర్ అండర్‌పాస్ బ్రిడ్జి కోసం ప్రారంభంకానుంది. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ఎడమ వైపు (ఎల్‌హెచ్‌ఎస్) ప్రజలకు ఉపయోగపడుతుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) ప్రాజెక్టులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని జిహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఎల్‌బి నగర్ హైదరాబాద్ నుండి విజయవాడ, వరంగల్, నల్గొండకు రాకపోకలు సాగించే ప్రజలకు ప్రధాన ప్రవేశం ఇది.
ఈ అండర్ పాస్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో చాలావరకు ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయి. సిటీ వాసుల రాకపోకలకు మరింత సుగమంకానుంది. ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్‌ను రూ.9.28 కోట్లతో నిర్మించగా, బైరామల్‌గూడ ఎల్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను రూ.28.6 కోట్లతో అభివృద్ధి చేశారు. అండర్ పాస్ 12.875 మీటర్ల వెడల్పుతో 490-మీటర్ల పొడవు, మూడు-లేన్ యూని-డైరెక్షన్‌లో 72.50-మీటర్ల వెడల్పు. 780 మీటర్ల పొడవైన బైరామల్‌గూడ LHS ఫ్లైఓవర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరామ్‌ఘర్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి.