Site icon HashtagU Telugu

Haleem Price: హలీమ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్

Haleem Price

Haleem Price

Haleem Price: రంజాన్ ప్రారంభానికి కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ మాసంలో హలీమ్ ని తినేందుకు ప్రతిఒక్కరు ఇష్టపడుతారు. ఈ సారి హలీమ్ డిమాండ్‌ను తీర్చడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ వీధులు సందడిగా మారాయి . అయితే ఈ సంవత్సరం వినియోగదారులకు హలీమ్ ధరలు షాక్ ఇవ్వనున్నాయి. ధరలలో స్వల్ప పెరుగుదల లేదా ఉండనున్నట్లు హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు.

హలీమ్ ధరలు రూ.30 నుండి రూ. 40 వరకు పెరుగుతాయని హోటళ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక హలీమ్‌లోని అవసరమైన డ్రై ఫ్రూట్స్, మటన్, గుడ్లు మరియు నెయ్యి వంటి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా హలీమ్ రేట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే గత సంవత్సరం, క్లాసిక్ హలీమ్ ధర రూ. 200 మరియు రూ. 250 మధ్య ఉంది.అయితే ఏ ఏడాది 300 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో హలీమ్ లవర్స్ కు కష్టాలు తప్పవు.

Also Read: Suicide: సూర్యాపేటలో స్కూల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి