Shafat Ali Khan : ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో చిరుత పులులు కలకలం క్రియేట్ చేశాయి. ఎంతోమందిని అవి మట్టుబెట్టాయి. అమాయక పిల్లల ప్రాణాలను బలిగొన్నాయి. నాలుగు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని రెండుచోట్ల పిల్లల మరణాల వెనుక కూడా చిరుతలే ఉన్నాయని తేలింది. ఈ తరుణంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక పేరు.. షఫత్ అలీఖాన్. ప్రస్తుతం 65 ఏళ్ల వయసు కలిగిన ఈయన మన హైదరాబాదీ బిడ్డ. పులులు, చిరుతలు, ఏనుగులను పట్టడంలో ఈయన దిట్ట. ఇప్పటిదాకా ఎన్నో చిరుతలు, పులులు, ఏనుగులను ఆయన సక్సెస్‌ఫుల్‌గా పట్టారు. ఇలా వన్యప్రాణులను పట్టేందుకు ఆయనకు లైసెన్సు కూడా ఉంది. కొత్త విషయం ఏమిటంటే.. ఇటీవలే రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ పరిధిలో ఓ చిరుత ఎనిమిది మందిని చంపింది. దీంతో దాన్ని తుపాకీతో కాల్చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఈక్రమంలో అక్కడి అటవీ అధికారులు షఫత్ అలీఖాన్(Shafat Ali Khan) సాయం కోరారు. ప్రస్తుతం ఆయన ఆ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.
Also Read :Meals On Asteroids : మీల్స్ తయారీకి ఆస్టరాయిడ్ల వినియోగం.. ఎలా ?
- షఫత్ అలీఖాన్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్. ఆయన తాతయ్య నవాబ్ సుల్తాన్ అలీఖాన్ బహదూర్ బ్రిటీష్ దొరలకు వేటలో సలహాలు ఇచ్చేవారు. చిన్నప్పటి నుంచే తాతతో కలిసి షఫత్ అడవుల్లో వేటకు వెళ్లేవారు.
- షఫత్ అలీఖాన్ నేషనల్ లెవల్లో షూటింగ్ ఛాంపియన్‌గా కూడా ఒకసారి నిలిచారు.
- షఫత్ తొలిసారిగా 19 ఏళ్ల ఏజ్‌లో (1976లో) కర్ణాటకలోని మైసూరులో ఒక ఏనుగుకు మత్తు ఇచ్చి పడగొట్టారు. అయితే అంతకుముందు ఆ ఏనుగు 12 మందిని చంపింది. అయినా భయపడకుండా దాన్ని షఫత్ లొంగదీశారు.
- తొలిసారిగా కర్ణాటకలోని హెడ్‌డీ కోటలో ఆయన ఒక పులిని వేటాడి బంధించారు. అక్కడి ప్రజలకు దాని బాధ నుంచి విముక్తి కల్పించారు.
- బిహార్‌లో ఒక ఏనుగు ఐదుగురిని చంపడంతో.. దాన్ని హతమార్చాలని అప్పటి రాష్ట్ర సర్కార్ ఆదేశాలిచ్చింది. అయితే షఫత్ అలీఖాన్ రంగంలోకి దిగి దానికి మత్తు ఇచ్చి లొంగదీశారు. జూ పార్కుకు తరలించారు.
- ఇప్పటివరకు చిరుతలు, పులులు, ఏనుగులను పట్టేందుకు సంబంధించిన 120 దాకా హంటింగ్ ఆపరేషన్లను షఫత్ నిర్వహించారు.
- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు, పశువైద్యులకు జంతువులను పట్టే విషయంలో షఫత్ ట్రైనింగ్ ఇస్తుంటారు.