Hyderabad Zoo: జంతువులు భద్రం.. కోవిడ్ దూరం!

కరోనా వైరస్ జంతువులతో సహా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. పులులు, సింహాలు సైతం కొవిడ్ బారిన పడుతుండటంతో ‘హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్’ పార్క్ అధికారులు జంతువుల ఎన్‌క్లోజర్లలోకి కొవిడ్ ప్రవేశించకుండా

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 05:19 PM IST

కరోనా వైరస్ జంతువులతో సహా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. పులులు, సింహాలు సైతం కొవిడ్ బారిన పడుతుండటంతో ‘హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్’ పార్క్ అధికారులు జంతువుల ఎన్‌క్లోజర్లలోకి కొవిడ్ ప్రవేశించకుండా చూసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. “ఇప్పటి వరకు, నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని జంతువులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. అయితే, నగరంలో పెరుగుతున్న కేసులు జంతువులపై ప్రభావం చూపకుండా చూసేందుకు మేం కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్లు అన్ని జంతువులను నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటి ప్రవర్తన, ఆహారం, నిద్ర విధానాలను పర్యవేక్షిస్తున్నారు. మా సిబ్బంది ప్రతిఒక్కరూ జంతువులతో సన్నిహితంగా ఉన్న ప్రతిసారీ మాస్క్ లు ధరిస్తారు” అని NZP క్యూరేటర్ ఎస్ రాజశేఖర్ మీడియాతో చెప్పారు. గతేడాది సిటీలో సెకండ్ వేవ్ కారణంగా ఎనిమిది ఆసియా సింహాలు కోవిడ్ -19 కు పాజిటివ్ అని తేలింది. ముక్కు, గొంతు, శ్వాసనాళాల నుండచి అనస్థీషియా కింద సేకరించిన సింహాల నమూనాలను CCMB-LaCONESతో పరీక్షించారు.

“గత కొన్ని వారాల్లో సందర్శకుల సంఖ్య ఖచ్చితంగా తగ్గింది. మేం దాదాపు 40 శాతం మంది మాత్రమే జూను విజిట్ చేస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు 2,000 మంది సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూ ప్రాంతం చాలా పెద్దది కాబట్టి, సామాజిక దూరాన్ని కూడా నిర్ధారించడం సులభం. సఫారీ బస్సులలో కూడా అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటిస్తున్నాం ” అక్కడి ఉద్యోగి రాజశేఖర్ చెప్పారు.

నగరంలో చలిగాలుల వంటి పరిస్థితుల నుంచి జంతువులను రక్షించడానికి అదనపు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఈ జూలో గత వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గాయి. “మేం రాత్రిపూట బోనులు బాగా వేడిగా ఉండేలా చూసుకుంటున్నాం. తద్వారా అవి ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా ఉంటాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మా సిబ్బంది శిక్షణ పొందారు’’ అని క్యూరేటర్ తెలిపారు. నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రస్తుతం 190 జాతులకు చెందిన 2,000 జంతువులు, పక్షులు ఉన్నాయి.