Site icon HashtagU Telugu

Smartphone addiction:సైకో డిజార్డర్స్ తో బాధపడుతున్న హైదరాబాద్ యువత…సర్వేలో షాకింగ్ నిజాలు..!!

Addiction

Smartphone addiction

ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్…ఈ రెండూ అందుబాటులోకి వచ్చాన తర్వాత చాలామంది ఎక్కువ భాగం వీటితోనే గడిపేస్తున్నారు. బయ టిప్రపంచంతో కంటేనూ…వర్చువల్ వరల్డ్ తోనే ఎక్కువగా వివహరిస్తున్నారు. తిన్నా..పడుకున్నా…లాస్ట్ కు టాయిలెట్ సీటుపై కూర్చున్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. కోవిడ్ సమయంలో స్మార్ట్ ఫోన్ తో రోజులు గడిచిపోయాయి. అయితే తాజాగా ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ యువకుల్లో సగంమంది స్మార్ట్ ఫోన్ వ్యసనం కారణంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తేలింది. కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి చెందిన ధరణి టెక్కం, సుధాబాలా, హర్షల్ పాండ్వే చేసిన సర్వేలో ఈ షాకింగ్ విషయం బయటపడింది.

యువకుల్లో సగం మంది స్నేహితులు, బంధువుల కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ తోనే కనెక్ట్ అయ్యారని తేలింది. హైదరాబాద్ లోని యువత మానసిక క్షోభపై పబ్బం గడుపుతున్న పర్యవసానంగా అనే శీర్షికతో నిర్వహించిన ఈ అద్యయనంలో ఎక్కువ మంది ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. పబ్బింగ్ అనేది మోడ్రన్ కమ్యూనికేషన్ గా నిర్వహించబడింది. దీనిలో ఒక వ్యక్తి ఇతరులతో సంభాషణకు బదులుగా ఫోన్ పైన్నే ఎక్కువగా ద్రుష్టిని కేంద్రీకరించడం ద్వారా సామాజిక నేపథ్యంలో మరొకరని స్నబ్ చేస్తాడు. ఈ అలవాటు యువతను చెడు మార్గాల్లో పయణించేలా చేస్తుంది. అంతేకాదు యువత మానసిక శ్రేయస్సును ప్రభావితం చేసే ప్రతికూల పరిణామంగా చెప్పవచ్చు.

తాజా సర్వే ప్రకారం..స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం గణనీయంగా తగ్గుతోంది. స్మార్ట్ ఫోన్ కారణంగానే తమ ఆత్మీయులతో టచ్ లో ఉంటున్నామని చెప్పడం గమనార్హం.