Hyderabad Youngster: సైకిల్ యాత్ర చేస్తూ, ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తూ!

ఓటుహక్కుతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందనే సందేశంతో ఓ యువకుడు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు.

Published By: HashtagU Telugu Desk
Ali

Ali

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. కానీ చాలామంది విద్యావంతులు కూడా రాజకీయ వ్యవస్థలోని లోపాలను తిట్టుకుంటూ ఓటుహక్కుకు దూరంగా ఉంటున్నారు. ఓటుహక్కుతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందనే సందేశంతో ఓ యువకుడు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటు హక్కుపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఈ యువకుడి పేరు ఉస్మాన్ ఫైజాన్ అలీ. ఓటుహక్కు వినియోగంపై దేశవ్యాప్తంగా సైకిల్ యాత్రకు సిద్ధమయ్యాడు.

జూన్ 25న హైదరాబాద్ లో యాత్ర ప్రారంభమవుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నాడు. ఈ సందర్భంగా ఉస్మాన్ మాట్లాడుతూ “ప్రజలతో నా పరస్పర చర్యలో ఓటు విలువ, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పిస్తాను” అని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు త్రిపురలో సైకిల్ యాత్ర ముగుస్తుంది. మొత్తం 50,000 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగనుంది.

తాను సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రయత్నించానని, అయితే సాధించలేకపోయానని అలీ చెప్పాడు. “ఆ సమయంలో, అణగారిన మరియు గిరిజన ప్రజలకు జ్ఞానోదయం చేయడమే నా అంతిమ లక్ష్యమని నేను గ్రహించాను” అని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తో సమావేశమై ఓటరు అవగాహన ప్రచారానికి మద్దతు కోరినట్లు తెలిపారు.

Also Read: VD12: పోలీస్ గెటప్ లో విజయ్ దేవరకొండ, కొత్త సినిమా షురూ!

  Last Updated: 17 Jun 2023, 12:06 PM IST