UK Invited: హైదరాబాద్ యువకుడికి ‘యూకే’ రెడ్ కార్పేట్!

యూకే చదువుతున్న హైదరాబాద్ యువకుడికి అరుదైన ఆహ్వానం అందింది. అతని ప్రతిభను మెచ్చిన యూకే పార్లమెంట్ ఆరోగ్య పరమైన విషయాలపై స్పీచ్ ఇచ్చేందుకు వెల్ కం చెప్పింది.

  • Written By:
  • Updated On - February 23, 2022 / 04:58 PM IST

యూకే చదువుతున్న హైదరాబాద్ యువకుడికి అరుదైన ఆహ్వానం అందింది. అతని ప్రతిభను మెచ్చిన యూకే పార్లమెంట్ ఆరోగ్య పరమైన విషయాలపై స్పీచ్ ఇచ్చేందుకు వెల్ కం చెప్పింది. దీంతో అతి చిన్న వయసులో పార్లమెంట్ లో స్పీచ్ ఇవ్వనున్న యువకుడిగా వార్తల్లోకి ఎక్కాడు ఈ యువకుడు. UKలోని లాంకషైర్ విశ్వవిద్యాలయంలో MBBS లాస్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు సాయి రామ్ పిల్లరిశెట్టి, టీకా ఈక్విటీ, దాని ప్రాముఖ్యతతో పాటు ప్రజారోగ్య సమస్యలపై ఎంపీలతో సంభాషించడానికి UK పార్లమెంట్‌కు ‘హెల్త్ హీరో’గా ఆహ్వానించబడ్డాడు. యునిసెఫ్, ది వన్ క్యాంపెయిన్ (గ్లోబల్ పేదరిక వ్యతిరేక సంస్థ), సేవ్ ది చిల్డ్రన్, ఇతరులు ఫిబ్రవరి 22న నిర్వహించిన UK హౌస్ ఆఫ్ పార్లమెంట్‌లో జరిగిన ఇంటరాక్షన్ ఈవెంట్‌లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన వైద్య విద్యార్థి సాయి రామ్. హైదరాబాద్‌కు చెందిన ఈ యువకుడితోపాటు జనరల్ ప్రాక్టీషనర్, డాక్టర్ ఫిలిప్ హేవుడ్, హాస్పిటల్ కన్సల్టెంట్, డాక్టర్ అలెక్సా వర్డీ, నర్సు హెలెన్ బ్రిడ్జ్ లను కూడా నిన్న సాయంత్రం పార్లమెంటు సభలకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ.. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే సింగిల్ వ్యాక్సిన్‌ డోస్‌ను తీసుకున్నారని, అధిక ఆదాయం ఉన్న దేశాల్లో 90 శాతం మంది సింగిల్ డోస్ తీసుకున్నట్టు చెప్పారు. “ఈ విషయంలో భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను ప్రారంభించడం ప్రశంసనీయం” అని అన్నారు. UK హౌసెస్ పార్లమెంట్‌లో MBBS విద్యార్థి మాట్లాడుతూ మహమ్మారిని అంతం చేయడానికి ఏకైక మార్గం వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఈక్విటీని పాటించడమేనని అన్నారు.