Women Warns Hydra: హైడ్రా వస్తే చస్తానో, చంపేస్తానో చూద్దాం: మహిళ ఆగ్రహం

Women Warns Hydra: హైడ్రాపై సామాన్యులు మండిపడుతున్నారు. పెద్దలను వదిలేసి పేదలను టార్గెట్ చేసి ఇళ్ళు కూల్చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక సామాన్యుల ఇళ్ళు నేలకూలాయి.

Published By: HashtagU Telugu Desk
Women Warns Hydra

Women Warns Hydra

Women Warns Hydra: మూసీ నది అభివృద్ధి పథకంలో భాగంగా కూల్చివేతలకు సిద్ధమవుతున్న తీరుపై చైతన్యపురి డివిజన్‌లోని విద్యుత్‌నగర్‌, ద్వారకాపురి, భవానీనగర్‌ ప్రాంత వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మాట్లాడుతూ సీఎం రేవంత్ (CM Revanth Reddy) పై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది. హైడ్రా వస్తే చస్తానో, చంపేస్తానో అంటూ ఆగ్రహం వక్తం చేసింది. ప్రస్తుతం సదరు మహిళ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (Hydra) ప్రజాప్రతినిధుల విలాసవంతమైన ఇళ్లను కూల్చివేయడం లేదని, కేవలం మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను ఎందుకు టార్గెట్ చేస్తోందని ఆ మహిళ ప్రశ్నించింది.‘‘సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి పూర్తి భిన్నంగా ఉంది. భద్రతా బలగాలను మోహరించి, స్తంభాలకు గుర్తులు వేసి మౌనంగా తమ పనిని సాగిస్తున్నారు. అధికారులు తనకు ఏమీ వెల్లడించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్మించిన షెడ్లను మాత్రమే ముట్టుకుంటున్నారని, నివాస గృహాలను తాకడం లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ హైడ్రా అపార్ట్‌మెంట్లను తాకుతున్నాయి. నాలుగు నెలల క్రితం మా వద్ద కరెంటు బిల్లులు వసూలు చేసేందుకు వచ్చి ఆ సాకుతో సర్వే చేయించారని మండిపడింది.

ఇదిలా ఉండగా హైడ్రాపై సామాన్యులు మండిపడుతున్నారు. పెద్దలను వదిలేసి పేదలను టార్గెట్ చేసి ఇళ్ళు కూల్చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక సామాన్యుల ఇళ్ళు నేలకూలాయి. తాజాగా తమ ఇంటిని ఎక్కడ కూల్చేస్తారోనని బుచ్చమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే హైడ్రా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తన పని తాను చేసుకుంటుం పోతుంది. మరోవైపు హైడ్రా చర్యలను కొందరు సమర్థిస్తున్నారు. అయితే ఒవైసీ ఫాతిమా కాలేజి నడి చెరువులో నిర్మించారని తేలినప్పటికీ సీఎం రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అటు రాజకీయ నేతల కట్టడాలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం సామాన్యుల ఇళ్లను కూల్చితే ఎలా అంటూ ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నారు.

Also Read: Nepal Floods: నేపాల్‌లో వరదల విధ్వంసానికి 50 మంది మృతి

  Last Updated: 28 Sep 2024, 09:31 PM IST