Site icon HashtagU Telugu

Telangana: హైదరాబాద్ లో భారీ వర్షం.. మూడు రోజులు రాష్ట్రానికి అలర్ట్

Weather Update

Hyd Rains Imresizer

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ (Hyderabad)లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ శుక్ర, శనివారాల్లో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

వాతావరణ శాఖ ప్రకారం.. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఏప్రిల్ 17 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 16 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేయబడింది. ఏప్రిల్ 17 నాటికి 41 డిగ్రీలకు, తరువాతి రోజుల్లో 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. IMD హైదరాబాద్ చేసిన వర్షపాత సూచనల దృష్ట్యా నివాసితులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Also Read: Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ శిక్ష నిలుపుదలపై ఈనెల 20న నిర్ణయం..!

కొన్నాళ్లుగా ఎండ, పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి వర్షాల వల్ల ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.