NTR Marg: ఫార్ములా వ‌న్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్‌. వివాదాస్ప‌ద‌మ‌వుతున్న నిర్ణ‌యం

ఫార్ములా వ‌న్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్‌ను బంద్ చేయ‌డంనూ వివాదం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డున్న చెట్ల‌ను తొల‌గించ‌డంపై ప‌లు స్వ‌చ్ఛంద సంస్ధ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 12:53 PM IST

ఫార్ములా వ‌న్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్‌ను బంద్ చేయ‌డంనూ వివాదం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డున్న చెట్ల‌ను తొల‌గించ‌డంపై ప‌లు స్వ‌చ్ఛంద సంస్ధ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో ఈవెంట్‌ నిర్వహణలో భాగంగా వివిధ సందర్భాల్లో ఎన్‌టీఆర్‌ మార్గ్‌ను బంద్‌ చేస్తామని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఎండీ సంతోష్ ప్ర‌క‌టించ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

అయితే, ఇబ్బంది ప‌డ‌కుండా వాహనదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ట్రాఫిక్‌ పోలీసులు చేస్తారని సంతోష్ ప్ర‌క‌టించారుజ‌ దేశంలోనే తొలిసారిగా నగరంలో ఫిబ్రవరి 11న జరిగే ఈ-ఫిక్స్‌ కార్‌ రేసు కోసం ఎన్టీఆర్‌ గార్డెన్‌ చుట్టూ 2.7కిలోమీటర్ల ట్రాక్‌ను ఎఫ్‌ఐఏ అనుమతులతో ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 600మీటర్ల మేర ఎన్టీఆర్‌ గార్డెన్‌లో నుంచి కొత్తగా రోడ్డు వేస్తున్నామని తెలిపారు. ట్రాక్‌ నిర్మాణం పూర్తవగానే ఈనెల 19, 20 తేదీల్లో మొదటి విడత, రెండోసారి డిసెంబర్‌ 10, 11 తేదీల్లో ట్రయల్స్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంలో ఎన్టీఆర్‌ మార్గ్‌లో రాకపోకలు నిలిపివేస్తామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే ఈ-ఫిక్స్‌ కార్‌ రేసు కోసం నాలుగు రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తామని వివరించారు. 30వేల మంది వీక్షించేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేస్తామని, ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని, ధర త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు.

Also Read:  CM Jagan : ఐటీసీతో జ‌గ‌న్ `స్పైసీ ` అడుగు

కారు రేస్‌ కోసం ట్రాక్‌ నిర్మాణం సందర్భంలో తొలగించిన 214చెట్లను ట్రాన్స్‌లోకేషన్‌ చేసేందుకు అనుమతులు తీసుకున్నామని, ఇప్పటికే 206చెట్లను ట్రాన్స్‌లోకేషన్‌ చేశామని ఎండీ సంతోష్‌ తెలిపారు. దీని నిమిత్తం రూ.1,18లక్షల మేర ఫారెస్టు విభాగానికి ఫీజులు చెల్లించామన్నారు. రేసులో కారు వేగం గరిష్టంగా 320కిలోమీటర్ల మేర ఉంటుందని, అందుకనుగుణంగా రోడ్డును డిజైన్‌ చేస్తున్నామని తెలిపారు.

ట్రయల్స్‌ వీక్షించేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు..

వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ కారు రేసు నేపథ్యంలో ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించే ట్రయల్స్‌ను వీక్షించేందుకు టికెట్లు కొనాల్సిందే. ఈ టికెట్లను బుక్‌ మై షోలో నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. రెగ్యులర్‌ పాస్‌ రూ.749. కాగా ఇదీ ఒకే రోజుకు నిర్ణీత సమయానికి వినియోగించే అవకాశముంటుంది. వీకెండ్‌ పాస్‌ ధర రూ.1249 నుంచి 11,999 వరకు నిర్ణయించారు. ఇందులో ఐదు స్టాండ్‌ల టికెట్లు ఉన్నాయి. వీటి ధర రూ.1,999 ఉండగా, పడ్డక్‌ గోల్డ్‌ రూ.8499, పడ్డక్‌ ప్లాటినం ధర రూ.11,999గా ఉంది. ఈ టికెట్లు రెండు రోజులపాటు చెల్లుబాటవుతాయి.

Also Read:  Tamilisai : పాపం గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై