Site icon HashtagU Telugu

పుష్ప సినిమాపై ట్రాఫిక్ పోలీసుల సెటైర్‌

Pushpa

Pushpa

అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పుష్ప’ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గత వరం రిలీజ్ అయిన పుష్ప ట్రైల‌ర్‌లో బైక్ పై యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. మీరు ఆ ట్రైలర్ ని చూసి బాగుందని వదిలేసి ఉంటారు. కానీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు మాత్రం ఆలా చూసి వదిలేయలేదు. బైక్ పై హెల్మెట్ లేని అల్లుఅర్జున్ ను చూసి వాళ్లకు తగ్గట్టుగా దాన్ని వాడుకున్నారు. ట్రైలర్ చివర్లో ఒక పోలీస్ ఆఫీసర్ డైలాగ్ ‘పార్టీ లేద పుష్ప’ అని ఉంటుంది కదా . ఆ డైలాగ్ బదులు బైక్ పై హెల్మెట్ లేని పుష్పను చూస్తూ ఆ పోలీస్ ఆఫీసర్ ‘హెల్మెట్, మిర్రర్స్ లేవా పుష్ప’ అని అంటాడు. ఎంతైనా ట్రాఫిక్ పోలీసు డిపార్టుమెంటు కదా ఇలాంటి ఐడియా లు వాళ్ళకే వస్తాయి. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.